ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి.
OnePlus 13 స్పెసిఫికేషన్స్ (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై OnePlus 13 యొక్క సమాచారాన్ని షేర్ చేశారు.
లీక్ ప్రకారం, OnePlus 13 స్మార్ట్‌ఫోన్ సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, ఎఫ్/1.6 అపర్చర్ తో రానుందని తెలుస్తోంది.
గతంలో ఒక లీక్ ద్వారా ఇదే టిప్‌స్టర్, OnePlus 13 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ తో రానుందని తెలిపారు.
OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది గత మోడల్ OnePlus 12 కంటే ఎక్కువ. ఈ భారీ బ్యాటరీని చార్జ్ చేసేందుకు 100 వాట్ వైర్డ్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అందించనున్నారు.
OnePlus 13 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, మైక్రో-కర్వేచర్ డిజైన్, 1440*3168 పిక్సెల్స్ 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.
చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్సెట్ అక్టోబర్ నెలలో లాంచ్ కానుంది. ఇది ఒ916టి హాప్టిక్ మోటర్ తో వస్తోంది.
కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్882 పెరిస్కోప్ 3ఎక్స్ జూమ్ లెన్స్ ఉంటాయి.
సాఫ్ట్‌వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 15 తో లాంచ్ అవుతుంది.
కనెక్టివిటీ: OnePlus 13 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
ఇతర ఫీచర్లు: OnePlus 13 లో ఐపీ68 లేదా ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటుందని అంచనా.
