Home News OnePlus 13: బీఓఈ ఎక్స్2 క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న వన్‌ప్లస్ 13

OnePlus 13: బీఓఈ ఎక్స్2 క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న వన్‌ప్లస్ 13

Highlights
  • త్వరలో OnePlus 13 విడుదల
  • డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారు
  • బీఓఈ ఎక్స్2 డిస్ప్లేతో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా, వన్‌ప్లస్ కంపెనీ ప్రెసిడెంట్ లీ జీ లూయిస్ OnePlus 13 యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్‌ను కన్ఫర్మ్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 13 డిస్ప్లే వివరాలు

బీఓఈ ఎక్స్2 డిస్ప్లే BOE గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ లో లాంచ్ అయ్యింది. చైనాలో ఈ సదస్సు జరిగింది.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లో ఈ బీఓఈ ఎక్స్2 డిస్ప్లే వాడనున్నట్లు వన్‌ప్లస్ ప్రెసిడెంట్ లీ జీ లూయిస్ తెలిపారు.

ఈ BOE X2 డిస్ప్లే ద్వారా హై బ్రైట్నెస్ మరియు బెటర్ ఐ ప్రొటెక్షన్ లభిస్తాయి.

OnePlus 12 లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 600 నిట్స్ సాధారణ బ్రైట్నెస్, 1600 నిట్స్ హై బ్రైట్నెస్ అందించారు.

OnePlus 13 లో వన్‌ప్లస్ 12 కంటే బెటర్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని సమాచారం.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే క్వాడ్ కర్వ్డ్ బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1440*3168 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఒ916టి హాప్టిక్ మోటర్ ను ఇందులో అందించనున్నారు

కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: OnePlus 13 డివైజ్ ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం.