గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో రానున్న OnePlus Ace 2 Dimensity Edition?

Highlights

  • 3C సర్టిఫికేషన్ పై 80 వాట్ చార్జర్ తో కనిపించిన OnePlus Ace 2 Dimensity Edition
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో రానున్న OnePlus Ace 2 Dimensity Edition
  • OnePlus Ace 2 Dimensity Edition గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం

OnePlus Ace 2 Dimensity Edition లాంచ్ సమయం సమీపిస్తోంది. ఈ నెల ఆరంభంలో చైనాలో OnePlus Ace 2 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచైంది. ఇదే ఫోన్ భారత్ లో OnePlus 11R 5G గా ఎంట్రీ ఇచ్చింది. ఇక OnePlus Ace 2 Dimensity Edition త్వరలోనే లాంచ్ కానుందని ఈ వారం ఆరంభంలో OnePlus చైనా ప్రెసిడెంట్ Li Jie టీజ్ చేశారు.

OnePlus Ace 2 Dimensity Edition డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ తో లాంచ్ కానుంది. ఇప్పుడు ఇదే డివైజ్ PHP110 మోడల్ నంబర్ తో చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో లాంచ్ పై స్పష్టత వచ్చింది. గ్లోబల్ గా OnePlus Ace 2 Dimensity Edition, OnePlus Nord 3 పేరుతో రానున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది.

80W చార్జర్ తో రానున్న OnePlus Ace 2 Dimensity Edition (లీక్డ్)

3C లిస్టింగ్ ప్రకారం, OnePlus Ace 2 Dimensity Edition డివైజ్ బాక్స్ లో 80 వాట్ ఫాస్ట్ చార్జర్ రానున్నట్లు సమాచారం. స్నాప్ డ్రాగన్ వర్షన్ 100 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయగా, డైమెన్సిటీ వర్షన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డైమెన్సిటీ వర్షన్ ని కంపెనీ కాస్త తక్కువ ధరకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 3సీ సర్టిఫికేషన్ ద్వారా మనకు తెలిసిన వివరాలు ఇంతే.

OnePlus Nord 3 పేరుతో గ్లోబల్ గా లాంచ్ కానున్న OnePlus Ace 2 Dimensity Edition?

OnePlus Ace 2 Dimensity Edition ని మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తుండటంతో, ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 గా రానుందని అర్థమవుతోంది. నిన్న, టిప్‌స్టర్ Steve Hemmerstoffer, MySmartPrice కలిసి OnePlus Nord 3 పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాయి.

లీకైన వివరాల ప్రకారం, OnePlus Nord 3 లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఫోన్ లభించనుంది. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలీకైన Motorola Razr (2023) లాంచ్ తేదీ
Next article5.45-inch డిస్ప్లే, Android 12 Go Edition తో లాంచైన Nokia C02
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.