Home News ఫ్లాట్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 2 Dimensity Edition

ఫ్లాట్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 2 Dimensity Edition

Highlights
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో రానున్న OnePlus Ace 2 Dimensity Edition
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ఫ్లాట్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న OnePlus Ace 2 Dimensity Edition
  • రీసెంట్ గా చైనాలో లాంచైన OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్

OnePlus సంస్థ రీసెంట్ గా చైనాలో OnePlus Ace 2 ని లాంచ్ చేసింది. ఇకపోతే ఇదే కంపెనీ భారత్ లో OnePlus 11R 5G ని కూడా లాంచ్ చేసింది. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వచ్చింది. చూస్తుంటే, రానున్న రోజుల్లో OnePlus Ace 2 కొత్త వేరియంట్ రానుందని అనిపిస్తోంది. తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం, వన్‌ప్లస్ సంస్థ OnePlus Ace 2 డైమెన్సిటీ ఎడిషన్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చైనాతో పాటు భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

అయితే వన్ ప్లస్ సంస్థ దీనికి సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించలేదు. కానీ, కొత్తగా బయటకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం, త్వరలో వన్‌ప్లస్ నుంచి Ace సిరీస్ ఫోన్ రానుందని తెలుస్తోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 2 Dimensity Edition

OnePlus Ace 2 Dimensity Edition ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ గా చైనాలో లాంచ్ కానుంది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో వస్తోంది. ఈ ఫోన్ ధర OnePlus Ace 2 కంటే తక్కువగానే ఉండనుంది. ఏస్ 2 డివైజ్ 12జిబి + 256జిబి వేరియంట్ ధర CNY 2799 (సుమారు రూ.34,100) గా ఉంది.

డిస్ప్లే విభాగం లో OnePlus Ace 2 Dimensity Edition పలు మార్పులతో రానుంది. టప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, OnePlus Ace 2 Dimensity Edition డివైజ్ PHP110 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఏస్ 2 లో మాదిరి డిస్ప్లే ఇందులో ఉండనుంది. అంటే OnePlus Ace 2 Dimensity Edition 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తోందన్నమాట. అయితే OnePlus 11R లో మాదిరి కాకుండా OnePlus Ace 2 Dimensity Edition ఫ్లాట్ డిస్ప్లే తో వస్తోంది. 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉండనుంది. ఇకపోతే ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Ace 2 Dimensity Edition లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. కెమెరా విషయానికి వస్తే, ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి గెలాక్సీకోర్ GC02M మ్యాక్రో లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా OmniVision OV64M సెన్సర్ తో వస్తోంది.

OnePlus Ace 2 Dimensity Edition ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. గ్లోబల్ ఎడిషన్ ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో వస్తుంది.

OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్

OnePlus Ace 2 లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, కర్వ్డ్ ఎడ్జెస్, హోల్-పంచ్ కటౌట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.