స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో చైనాలో లాంచైన OnePlus Ace 2 Pro

Highlights

  • చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన OnePlus Ace 2 Pro
  • 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చిన డివైజ్
  • OnePlus Ace 2 Pro ప్రారంభ ధర CNY 2,999 (రూ.34,500)

OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ గతంలో వచ్చిన OnePlus Ace 2 కి సక్సెసర్ గా వచ్చింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయ్యింది. తాజాగా వచ్చిన OnePlus Ace 2 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీతో వచ్చింది. సరే, ఓసారి OnePlus Ace 2 Pro ధర, ఇతర స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 2 Pro ధర, లభ్యత

OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ మెటాలిక్ అరోరా గ్రీన్ మరియు టైటానియమ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ యొక్క 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను CNY 2,999 (సుమారు రూ.34,500) గా నిర్ణయించారు. 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ యూనిట్ ధర CNY 3,399 (సుమారు రూ.38,800) గా ఉంది.

ఇక టాప్-ఎండ్ మోడల్ అయిన 24జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ వేరియంట్ ధరను CNY 3,999 (సుమారు రూ.45,600) గా నిర్ణయించారు. ఈ డివైజ్ ఆగస్టు 16 నుంచి చైనాలో ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 23 నుంచి సేల్ మొదలవుతుంది.

OnePlus Ace 2 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: OnePlus Ace 2 Pro లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • చిప్సెట్: OnePlus Ace 2 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం 740 జీపీయూ వినియోగించారు.
  • ఓఎస్: OnePlus Ace 2 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 2 Pro డివైజ్ లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందించారు.
  • రియర్ కెమెరా: OnePlus Ace 2 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి శాంసంగ్ S5K3P9 కెమెరా సెన్సర్ అందించారు.
  • బ్యాటరీ: OnePlus Ace 2 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Ace 2 Pro లో 5జీ, 4జీ, వై-ఫై 7, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.