Home News 16GB ర్యామ్, 100W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2

16GB ర్యామ్, 100W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2

హైలైట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ త్వరలోనే OnePlus Ace 2 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది OnePlus Ace కి సక్సెసర్ గా వస్తోంది. తాజాగా OnePlus Ace 2 యొక్క స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ లీక్‌స్టర్ యోగేశ్ బ్రార్ తన ట్విట్టర్ ఖాతాపై పోస్ట్ చేశాడు. ఈ హ్యాండ్సెట్ OnePlus Ace కి సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ ని Realme GT Neo 4 గా రీబ్రాండ్ చేసే అవకాశం ఉంది. ఒరిజినల్ OnePlus Ace ని OnePlus 10R గా రీబ్రాండ్ చేసి భారత్ లో లాంచ్ చేసారు. OnePlus Ace 2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో లాంచ్ కానుందని సమాచారం. గత మోడల్ OnePlus Ace మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ తో వచ్చింది.

OnePlus Ace 2 కి సంబంధించిన లాంచ్ తేదీని లీక్‌స్టర్ వెల్లడించలేదు. వచ్చే ఏడాది ఆరంభంలో OnePlus Ace 2 చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్‌స్టర్ వెల్లడించాడు. గత మోడల్ OnePlus Ace 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రాగా, OnePlus Ace 2 మాత్రం 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ 1.5k ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు సమాచారం. పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఇందులో ఉండనుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడనున్నారు. 8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

ఇప్పుడు OnePlus Ace 2 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OnePlus Ace 2 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇకపోతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఓసారి గత మోడల్ OnePlus Ace తో పోల్చితే OnePlus Ace 2 కెమెరా విభాగంలో మాత్రం అప్‌గ్రేడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే OnePlus Ace లో సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ వాడారు. OnePlus Ace 2 సోని ఐఎంఎక్స్890 లెన్స్ తో వస్తోంది. రానున్న రోజుల్లో OnePlus Ace 2 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.