త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ అఫీషియల్ టీజర్ వీడియోని OnePlus సంస్థ రివీల్ చేసింది. ఈ డివైజ్ చైనాలో మార్చి 7 న లాంచ్ అవుతోంది. OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ కానుంది. ఇక తాజాగా రివీలైన కొత్త టీజర్ ద్వారా డిజైన్, ఫినిషెస్ కి సంబంధించిన గ్లిమ్స్ తెలిసాయి.
OnePlus Ace 2V డిజైన్
OnePlus Ace 2V టీజర్ వీడియో చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై ప్రత్యక్షమైంది. ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్ పై షేర్ చేశారు. దీంతో OnePlus Ace 2V ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్లాసీ ఫినిషింగ్ తో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ మాడ్యూల్స్ లో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. అలాగే రెండు ఎల్ఈడీ ఫ్లాషెస్ ఉన్నట్లు అనిపిస్తోంది.
సంప్రదాయ వన్‌ప్లస్ అలర్ట్ స్లైడర్ OnePlus Ace 2V తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ అలర్ట్ స్లైడర్ త్రీ స్టేజెస్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. అవి: మ్యూట్, వైబ్రేట్ మరియు రింగ్. OnePlus Ace 2V లో పవర్ బటన్ కుడివైపున ఉండగా, వాల్యూమ్ రాకర్ ఎడమవైపున ఉంది. టాప్ ఎడ్జ్ లో సెకండరీ మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ముందు వైపున ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్
OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ లో MediaTek Dimensity 9000 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ కానుంది. OnePlus Ace 2V లో 6.72-inch FHD+ AMOLED స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
OnePlus Ace 2V కెమెరా విభాగం విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం OnePlus Ace 2V లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. దీని ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు రానున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
