ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో Ace 3 ఫోన్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ OnePlus Ace 3 లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 4న OnePlus Ace 3 చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇదివరకు వచ్చిన OnePlus Ace 2 కూడా OnePlus 11R పేరుతో ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి OnePlus Ace 3 లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OnePlus Ace 3 చైనా లాంచ్ తేదీ
- OnePlus Ace 3 స్మార్ట్ఫోన్ చైనాలో జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. టీజర్ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.
- గ్రే, గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.
- “OnePlus Ace 3, Ace 2 కి అప్గ్రేడ్ గా వస్తోంది. ఇది ఫ్లాగ్షిప్ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళ్తుంది.” అని OnePlus చైనా హెడ్ లూయీస్ జీ చెప్పారు.
OnePlus Ace 3 డిజైన్
OnePlus 12R / OnePlus Ace 3 official teaser in all the color variants! #OnePlus12R #OnePlus pic.twitter.com/aq8ab3uKlo
— OnePlus Club (@OnePlusClub) December 27, 2023
- OnePlus Ace 3 ని వన్ప్లస్ సంస్థ చాలా రోజుల నుంచి సోషల్ మీడియా వేదికలపై టీజ్ చేస్తూ వస్తోంది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది.
- OnePlus Ace 3 డివైజ్ శాండ్ గోల్డ్, బ్లాక్ మరియు బ్లూ కలర్ వేరియంట్స్ లో కనిపించింది.
- OnePlus Ace 3 లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని టీజర్స్ ద్వారా తెలుస్తోంది.
- OnePlus Ace 3 లో కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటాయి. ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంటుంది.
- OnePlus Ace 3 డివైజ్ కి టాప్ లో మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్ ఉంటాయి.
OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: లీక్స్ ప్రకారం, OnePlus Ace 3 డివైజ్ 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ తో రానుందని తెలుస్తోంది.
- ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ చిప్ క్లాక్ స్పీడ్ 3.19గిగాహెర్ట్జ్.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
- కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
