16GB ర్యామ్, 100W చార్జింగ్‌తో వస్తోన్న OnePlus Ace 3; లీకైన స్పెసిఫికేషన్స్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 3
  • 50ఎంపి+32ఎంపి కెమెరా సెటప్‌తో వస్తోన్న డివైజ్
  • 2024 జనవరిలో OnePlus Ace 3 లాంచ్ అయ్యే అవకాశం

OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. తొలుత చైనాలో లాంచైన తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ ఫోన్ రానుంది. అయితే గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి OnePlus Ace 3 లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు. ఈలోపు OnePlus Ace 3 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: OnePlus Ace 3 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఈ చిప్ క్లాక్ స్పీడ్ 3.19 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఇక బేస్ వేరియంట్ 12జిబి ర్యామ్ తో రానుంది.
  • కెమెరా: OnePlus Ace 3 లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇంకా 32ఎంపి టెలీఫోటో కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్

OnePlus Ace 3 లాంచ్ కి సంబంధించి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. కానీ, లీక్స్ నిజమైతే గనుక, ఈ మొబైల్ ఫోన్ వచ్చే నెలలో అనగా 2024 జనవరిలో లాంచ్ అవుతుంది. OnePlus Ace 3 డివైజ్ కొన్ని దేశాల్లో OnePlus 12R గా లాంచ్ అవ్వనుందని కొన్ని రిపోర్ట్స్ అంచనా వేశాయి.