ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఏస్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ చైనాలో జులై నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ లీకైన వివరాలు తెలుసుకుందాం.
OnePlus Ace 3 Pro బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ (లీక్)
చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OnePlus Ace 3 Pro యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ కెపాసిటీ వివరాలను లీక్ చేశారు. లీక్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా-హై-డెన్సిటీ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం.
OnePlus Ace 3 Pro డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తున్నట్లు లీక్‌స్టర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్
OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.7-ఇంచ్ 1.5కే స్క్రీన్, ఓఎల్ఈడీ ప్రోఎక్స్‌డీఆర్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: OnePlus Ace 3 లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.
ఓఎస్: OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, అలర్ట్ స్లైడర్ ఉన్నాయి.
