Home News OnePlus: లీకైన Ace 3 Pro కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్, డిజైన్

OnePlus: లీకైన Ace 3 Pro కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్, డిజైన్

Highlights
  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus 2024 జనవరిలో Ace 3 ని లాంచ్ చేసింది. ఇప్పుడు OnePlus Ace 3 Pro ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. లేటెస్ట్ అప్డేట్ లో ఏస్ 3 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. OnePlus Ace 3 Pro డివైజ్ 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 6100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి లీకైన తాజా వివరాలను తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై OnePlus Ace 3 Pro యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలను షేర్ చేసింది.

లీక్ ప్రకారం, OnePlus Ace 3 Pro డివైజ్ సిరామిక్, గ్లాస్ మరియు లెదర్ మెటీరియల్స్ తో రానున్నట్లు తెలుస్తోంది.

సిరామిక్ మోడల్ వైట్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంటుంది. గ్లాస్ వేరియంట్ సిల్వర్ ఫినిష్ తో రావొచ్చని అంచనా.

డివైజ్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో రానుందని టిప్‌స్టర్ తెలిపింది.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు దస్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Ace 3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.