ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ జులైలో లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఈ డివైజ్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్‌తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో విడుదలవుతుంది. నేడు ఈ ఫోన్ యొక్క స్టోరేజీ ఆప్షన్స్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
OnePlus Ace 3 Pro స్టోరేజీ ఆప్షన్స్ (లీక్)
లీక్ ప్రకారం, OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో చైనాలో లాంచ్ అవుతుంది.
OnePlus Ace 3 Pro డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ కలెక్టర్స్ ఎడిషన్ కూడా లాంచ్ అవుతుందని సమాచారం. ఇది సిరామిక్ వైట్ షేడ్ లో అందుబాటులోకి వస్తుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
కలెక్టర్స్ స్పెషల్ ఎడిషన్ 16జిబి/24జిబి ర్యామ్, 512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
OnePlus Ace 3 Pro డివైజ్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. గ్రీన్ కలర్ వేరియంట్ వీగన్ లెదర్ ఫినిష్ తో వస్తుండగా, బ్లాక్ కలర్ మోడల్ గ్లాస్ బ్యాక్ తో వస్తోంది.
ధర విషయానికి వస్తే, OnePlus Ace 3 Pro బేస్ మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,000) గా ఉంటుందని సమాచారం. ఇక 24జిబి ర్యామ్ టాప్ మోడల్ ధర 4000 యువాన్లు (సుమారు రూ.45,954) గా ఉండే అవకాశం ఉంది.
OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
చిప్సెట్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
మెమొరీ: OnePlus Ace 3 Pro డివైజ్ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీతో వస్తోంది.
బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
కెమెరా: OnePlus Ace 3 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-800 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
