
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో ఒక ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా, ఈ డివైజ్ యొక్క లీక్స్ బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయ్యాయి. స్కీమాటిక్ ప్రోటోటైప్ ను టిప్‌స్టర్ సోషల్ మీడియాపై షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.
OnePlus Ace 3 Pro డిజైన్ రెండర్ (లీక్)
రెండర్ ఇమేజ్ ద్వారా డివైజ్ యొక్క లుక్స్ ఎలా ఉంటాయో రివీల్ అయ్యింది. ఏస్ 3 మాదిరిగా ఈ డివైజ్ కనిపిస్తోంది.
కొన్ని నివేదికలు, OnePlus Ace 3 Pro డిజైన్ మారుతుందని తెలిపాయి. అయితే, రెండర్ ఇమేజ్ చూస్తే మార్పు లేదని అర్థమవుతోంది.

బ్యాక్ ప్యానెల్ పై, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో నాలుగు చిన్న కెమెరా కటౌట్స్ ఉన్నాయి. మాడ్యూల్ కి పైన ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
డివైజ్ ముందువైపు, పంచ్ హోల్ కటౌట్ ఉంది. పవర్, వాల్యూమ్ బటన్స్ డివైజ్ కి కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంది.
ఈ డివైజ్ మెటల్ మిడ్ ఫ్రేమ్, గ్లాస్, సిరామిక్, లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోందని గతంలో కొన్ని లీక్స్ తెలిపాయి.
OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు దస్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: OnePlus Ace 3 Pro లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: OnePlus Ace 3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.











