Home News OnePlus: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్

OnePlus: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • 24జిబి ర్యామ్ (16జిబి + 8జిబి)
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో Ace 3 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒక లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. 24జిబి ర్యామ్ పవర్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. అంటే 16జిబి ఫిజికల్ ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుంది. సరే, ఓసారి OnePlus Ace 3 Pro యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 Pro డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4GHz.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro 8జిబి వర్చువల్ ర్యామ్, 16జిబి ఫిజికల్ ర్యామ్ తో వస్తోంది. 1టిబి వేరియంట్ కూడా లభిస్తుంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.