Home News OnePlus: లాంచ్‌కి ముందు రివీలైన Ace 3V లైవ్ ఇమేజ్

OnePlus: లాంచ్‌కి ముందు రివీలైన Ace 3V లైవ్ ఇమేజ్

Highlights
  • త్వరలో OnePlus Ace 3V లాంచ్
  • తాజాగా లీకైన లైవ్ ఇమేజ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3V పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. కొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ ప్రెసిడెంట్ OnePlus Ace 3V లాంచ్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా OnePlus Ace 3V లైవ్ ఇమేజ్ ని స్వయంగా కంపెనీ ప్రెసిడెంట్ షేర్ చేశారు. దీంతో ఫోన్ డిజైన్, లుక్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3V లైవ్ ఇమేజ్ డిజైన్

వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ, OnePlus Ace 3V యొక్క లైవ్ ఫోటోలను షేర్ చేశారు. డివైజ్ ఫ్రంట్ డిజైన్ ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది.

OnePlus Ace 3V లో ముందువైపున పంచ్ హోల్ కటౌట్ ఉంది. బెజెల్స్ సన్నగా ఉన్నాయి. దీంతో ఫోన్ హై స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుందని తెలుస్తోంది.

విశేషమేంటంటే, ఈ ఫోన్ అలర్ట్ స్లైడర్ తో వస్తోంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి.

OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (అంచనా)