ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ప్రస్తుతం తన తదుపరి Ace సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసే పనిలో ఉంది. OnePlus Ace 5 డివైజ్ త్వరలో వన్‌ప్లస్ నుంచి రానుంది. తొలుత చైనా మార్కెట్ లో అడుగుపెట్టనున్న ఈ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, వన్‌ప్లస్ ఏస్ 5 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OnePlus Ace 5 సిరీస్ కు సంబంధించిన వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, చైనా సామాజిక మాధ్యమం వీబో పై షేర్ చేశారు. ఈ సిరీస్ లో OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నట్లు గత లీక్స్ ద్వారా టిప్‌స్టర్ తెలిపారు. ఆ తర్వాత, లేటెస్ట్ లీక్ ద్వారా వన్‌ప్లస్ ఏస్ 5 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
OnePlus Ace 5 స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: లీక్ ప్రకారం, OnePlus Ace 5 లో 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, మైక్రో కర్వ్ డిజైన్ ఉంటాయని తెలుస్తోంది.
ప్రాసెసర్: OnePlus Ace 5 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
కెమెరా: OnePlus Ace 5 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
బ్యాటరీ, చార్జింగ్: OnePlus Ace 5 లో పవర్ బ్యాకప్ కోసం 6200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
OnePlus Ace 5 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో OnePlus 13R పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, OnePlus Ace 5 Pro స్పెసిఫికేషన్స్ ఇంకా రివీల్ కావాల్సి ఉంది. అయితే ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని చెప్పవచ్చు. OnePlus 13 అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
