
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక చవకైన ఫోన్ని లాంచ్ చేయనుంది. అయితే ఇంకా వన్ప్లస్ నుంచి అధికార ప్రకటన బయటకు రాలేదు. కానీ ఈ ఫోన్ మోడల్ నంబర్ CPH2163 మరియు రెండర్స్ ని 91mobiles షేర్ చేసింది. ఫోన్ యొక్క అసలైన పేరు ఇంకా తెలియదు. సరే, ఓసారి డిజైన్ మరియు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం పదండి.
కొత్త OnePlus ఫోన్ రెండర్స్ (లీక్)
- 91mobiles కి ఎక్స్క్లూజివ్ సోర్సెస్ నుంచి అందిన సమాచారం ప్రకారం, కొత్త వన్ప్లస్ డివైజ్ CPH2613 మోడల్ నంబర్ కలిగి ఉంది.
- డివైజ్ యొక్క రియర్ ప్యానెల్ గ్లాసీ ఫినిష్ తో ఉంది. డిస్ప్లే ఫ్లాట్ గా ఉంది. సైడ్ ఫ్రేమ్ ప్లాస్టిక్ అని తెలుస్తోంది.
- స్క్రీన్ పై ఫింగర్ ప్రింట్ యానిమేషన్ ని బట్టి, ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అమోలెడ్ ప్యానెల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- OnePlus కొత్త ఫోన్ లో సిమ్ ట్రే సెక్షన్, ప్రైమరీ మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో కనిపిస్తున్నాయి.
- వన్ప్లస్ కొత్త ఫోన్ లో సెకండరీ మైక్రోఫోన్ టాప్ లో ఉంది. ఐఆర్ బ్లాస్టర్ లేదా 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
- ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
OnePlus CPH2163 కెమెరా లిస్టింగ్
- OnePlus CPH2613 ఫోన్ ఎఫ్వీ-5 సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
- లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4096*3072 పిక్చర్ రెజుల్యూషన్, 5.6ఎంఎం ఫోకల్ లెంగ్త్ మరియు ఓఐఎస్+ఈఐఎస్ ఉన్నాయి.
- ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా, ఈఐఎస్ మరియు 2304*1728 పిక్చర్ రెజుల్యూషన్ ఉన్నాయి.