టీజ్ చేసినప్పుడు వన్ప్లస్ సంస్థ OnePlus Nord 3 డివైజ్ భారత్ లో వచ్చే నెలలో (జులై) లో లాంచ్ కానుందని తెలిపింది. ప్రస్తుతం, లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, గతంలో కూడా ఈ ఫోన్ అఫీషియల్ ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Nord 3 లుక్, డిజైన్ (లీకైన ఫోటోలు)
- ఫ్రంట్ ప్యానెల్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా మిడిల్ లో ఉంది. బెజెల్స్ లేకుండా, సన్నని ఎడ్జెస్ తో డిస్ప్లే కనిపిస్తోంది.
- బ్యాక్ ప్యానెల్: ఫోటోలను బట్టి చూస్తే, ఈ ఫోన్ మ్యాట్ ఫినిషింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. పైభాగాన ఎడమవైపున కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- సైడ్ ప్యానెల్: OnePlus Nord 3 డివైజ్ టాప్ ఎడ్జ్ లో స్పీకర్, ఐఆర్ బ్లాస్టర్, మైక్రోఫోన్ ఉన్నాయి. బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్-స్లాట్ మరియు స్పీకర్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, ఎడమవైపున పవర్ బటన్ ఉన్నాయి. అలర్ట్ స్లైడర్ కూడా ఉండటం విశేషం.
OnePlus Nord 3 ధర (లీక్)
రీసెంట్ గా లీకైన సమాచారాన్ని బట్టి, OnePlus Nord 3 ధర భారతీయ మార్కెట్ లో రూ.30,000 వద్ద ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ.40,000 వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
OnePlus Nord 3 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- కెమెరా: OnePlus Nord 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- చిప్సెట్, ఓఎస్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- వేరియంట్స్: OnePlus Nord 3 5G డివైజ్ లో రెండు ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో 12జిబి ర్యామ్ మరియు 16జిబి ర్యామ్ మోడల్స్ ఉంటాయి. 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
- బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
