
OnePlus 2 యొక్క సక్సెసర్ మరియు మొబైల్ లవర్స్ ఎదురుచూస్తోన్న మధ్య-శ్రేణి ఫోన్, OnePlus Nord 3 త్వరలో భారతదేశంలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం, దేశంలో Nord 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ టీజర్ ప్రకారం, Nord 3 డివైజ్ తో పాటు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరో Nord డివైజ్ ని కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది, ఇది OnePlus Nord CE 3 కావచ్చు. అలాగే, OnePlus Nord Buds 2r TWS త్వరలో భారతదేశంలో లాంచ్ అవ్వనున్నాయి.
లాంచ్ చేయాల్సిన కనీసం మూడు ఉత్పత్తులతో, వన్‌ప్లస్ జూలై నెలలో ఒక ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుందని భావిస్తున్నారు, దీని కోసం తేదీ ఇంకా నిర్ధారించబడలేదు. ఈ వారంలో లాంచ్ డేట్‌ని కంపెనీ నిర్ధారించే అవకాశం ఉంది. అధికారిక కార్యకలాపాలకు ముందు, ట్విట్టర్‌లో ప్రముఖ టిప్‌స్టర్, అభిషేక్ యాదవ్ భారతదేశంలో నార్డ్ 3 డివైజ్ యొక్క సాధ్యమైన ధర ఏమిటో వెల్లడించారు. ధర వివరాలను పరిశీలిద్దాం.
రూ.30,000 పైనే ఉండనున్న OnePlus Nord 3 ధర
ట్వీట్ ప్రకారం, OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంటుందని సమాచారం. మరోవైపు, 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టిప్‌స్టర్ ప్రకారం, ఈ ధరలు 90 శాతం నిజమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒకసారి గత మోడల్ గురించి తెలుసుకుందాం. OnePlus Nord 2 డివైజ్ 2021 లో 6జిబి+128జిబి వేరియంట్ రూ.27,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. 12జిబి+256జిబి ధర రూ.34,999 గా ఉంది.
OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- కెమెరా: OnePlus Nord 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- చిప్సెట్, ఓఎస్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- వేరియంట్స్: OnePlus Nord 3 5G డివైజ్ లో రెండు ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో 12జిబి ర్యామ్ మరియు 16జిబి ర్యామ్ మోడల్స్ ఉంటాయి. 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
- బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.











