Home News లీకైన OnePlus Nord 3 5G ధర, లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజెస్!

లీకైన OnePlus Nord 3 5G ధర, లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజెస్!

Highlights
  • జూన్ లో భారత్ లో లాంచ్ కానున్న OnePlus Nord 3 5G
  • భారత్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.30,000/రూ.32,000 ఉండే అవకాశం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ తో రానున్న OnePlus Nord 3 5G

OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ హ్యాండ్సెట్ నార్డ్ 2 కి సక్సెసర్ గా వస్తోంది. అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో, టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని పంచుకున్నారు. లాంచ్ టైమ్‌లైన్, ధరను యోగేశ్ రివీల్ చేశారు.

మరొక లీక్ లో, OnePlus Nord 3 5G యొక్క లైవ్ ఇమేజెస్ ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫోన్ పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది. అయితే, ఇది నిజమో కాదో తెలియదు. ఇకపోతే మనకు కనిపించిన ఇమేజ్ చైనీస్ వేరియంట్‌ది అని భావిస్తున్నారు.

OnePlus Nord 3 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర

OnePlus Nord 3 5G డివైజ్ భారత్ లో జూన్ లో లాంచ్ కానుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇక హ్యాండ్సెట్ ధర భారత్ లో రూ.30,000 లేదా రూ.32,000 లతో ప్రారంభమవుతుందని సమాచారం.

OnePlus Nord 3 5G ఫోన్‌వే అని చెప్పబడుతోన్న లైవ్ ఇమేజెస్

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

OnePlus Nord 3 సెల్ఫీ షూటర్ కోసం 120Hz మరియు పంచ్-హోల్ కటౌట్‌తో 6.74-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే కలిగి ఉంది.

ప్రాసెసర్

ఈ హ్యాండ్‌సెట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ

Nord 3 లో 12GB/16GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఉంటాయి.

ఓఎస్

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరాలు

OnePlus ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ లెన్స్ మరియు 2MP మూడవ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP షూటర్ ఉంటుంది.

బ్యాటరీ

ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.