ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలోనే కొత్త నార్డ్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఇప్పటికే OnePlus Nord 3 కి సంబంధించి చాలా రూమర్లు, లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా, OnePlus Nord 3 డివైజ్ మార్కెటింగ్ రెండర్స్ అంటూ కొన్ని ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉండనుందని తెలుస్తోంది.
OnePlus Nord 3 మార్కెటింగ్ రెండర్స్ (లీక్)
OnePlus Nord 3 మార్కెటింగ్ రెండర్స్ ద్వారా పూర్తి డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. OnePlus Nord 3 డివైజ్ OnePlus Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం Ace 2V డివైజ్ చైనాలో అందుబాటులో ఉంది. జర్మనీకి చెందిన పబ్లికేషన్ WinFuture OnePlus Nord 3 రెండర్స్ ని షేర్ చేసింది. త్వరలోనే యూరప్ లో OnePlus Nord 3 లాంచ్ కానుందని సమాచారం.
తాజాగా లీకైన రెండర్స్ ని బట్టి OnePlus Nord 3 చూడటానికి OnePlus Ace 2V మాదిరి కనిపిస్తోంది. పంచ్-హోల్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తున్నాయి. బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus Nord 3 లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కౌటౌట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుందని భావిస్తున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్/16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి.
- కెమెరా: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- ఓఎస్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
