లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Highlights

  • లీకైన OnePlus Nord 3 లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్
  • జూన్ మరియు జులై మధ్యలో గ్లోబల్ గా OnePlus Nord 3 లాంచ్ అవుతుందని అంచనా
  • డైమెన్సిటీ 9000, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న OnePlus Nord 3

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ చాలా రోజుల నుంచి నెట్టింట్లో హడావుడి చేస్తోంది. అడపాదడపా ఈ ఫోన్ కి సంబంధించిన లీక్స్, రిపోర్ట్స్ మన ముందు ప్రత్యక్షమవుతూ వస్తున్నాయి. తాజాగా OnLeaks సౌజన్యంతో MySmartPrice వెబ్‌సైట్ OnePlus Nord 3 యొక్క లాంచ్ టైమ్ లైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ గత రిపోర్ట్స్ ద్వారా తెలిసినట్లు 1.5కే డిస్ప్లే తో రావడం లేదు. OnePlus Nord 3 డివైజ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోంది. ఇకపోతే ఈ హ్యాండ్సెట్ బాగా ప్రాచుర్యం పొందిన అలర్ట్ స్లైడర్ తో రానున్నట్లు సమాచారం. జూన్ లేదా జులై మాసాల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

OnePlus Nord 3 డిజైన్ స్కెచెస్ ని బట్టి ఈ డివైజ్ సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బ్యాక్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ రింగ్స్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. OnePlus Nord 2/Nord 2T కి సక్సెసర్ గా OnePlus Nord 3 రానుందని సమాచారం.

వన్‌ప్లస్ నార్డ్ 3 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా జూన్ మరియు జులై మధ్యలో లాంచ్ అవ్వనుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అంటే ఈ ఫోన్ లాంచ్ కి ఇంకా చాలా సమయం ఉన్నట్లు అర్థమవుతోంది. ఈలోపు బ్రాండ్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన టీజర్లు వచ్చే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ సైడ్ ఫ్రేమ్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉండనుంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్ష్నస్ లో ఈ ఫోన్ లభించనుంది. OnePlus Nord 3 అలర్ట్ స్లైడర్ తో వస్తోంది.

OnePlus Nord 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి షూటర్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

గత మోడల్ అయిన OnePlus Nord 2 తో పోల్చితే OnePlus Nord 3 చెప్పుకోదగిన మార్పులతోనే వస్తోంది. కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే విభాగాల్లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.