
OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ రూ.30,000 లోపు ఉన్న పాపులర్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇదే ధర శ్రేణిలో ఉన్న మరొక ఫోన్ OPPO Reno 12 ను వన్‌ప్లస్ నార్డ్ 4 తో పోల్చి రెండింట్లో ఏది బెటర్ అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇందుకోసం మేం ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై కొన్ని టెస్టులు జరిపాం. ఆ టెస్టు ఫలితాలను ఓసారి చదివి తెలుసుకోండి.
| OnePlus Nord 4 | OPPO Reno 12 |
| 8జిబి+128జిబి ధర రూ.29,999 | – |
| 8జిబి+256జిబి ధర రూ.32,999 | 8జిబి+256జిబి రూ.32,999 |
| 12జిబి+256జిబి ధర రూ.35,999 | – |
డేలైట్
రెండు స్మార్ట్‌ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఇచ్చారు. దీంతో తీసిన డేలైట్ ఇమేజెస్ బాగున్నాయి. రెండు ఫోటోలను గమనిస్తే, కలర్ సైన్స్ లో తేడాను స్పష్టంగా కనిపిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ 4 తో తీసిన ఫోటోలో కలర్స్ బ్యాలన్స్‌డ్ గా ఉన్నాయి. మరోవైపు, ఒప్పో రెనో 12 లో కలర్ ప్రొఫైల్ ఎక్కువ వార్మ్ గా ఉంది. డైనమిక్ రేంజ్ రెండింట్లో సమానంగానే ఉంది.
రెండు ఫోన్లలో డీటెయిల్స్ సమానంగానే ఉన్నాయి. నార్డ్ 4 లో కాస్త ఎక్కువ క్లారిటీ ఉంది. జూమ్ చేసి చూస్తే బిల్డింగ్ పై ఉన్న ఐరన్-లైన్డ్ విండోస్ దగ్గర ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. మొదటి రౌండ్ లో రెండు ఫోన్లు కూడా సమానంగా నిలిచాయి.
విజేత: సమానం
అల్ట్రావైడ్
రెండు ఫోన్లలో తీసిన అల్ట్రావైడ్ షాట్స్ ను గమనిస్తే, కలర్స్ బ్యాలన్స్‌డ్ గానే ఉన్నాయి. రెండు ఫోన్లలో 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. కాబట్టి, డీటెయిల్స్ కూడా ఒకే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. జూమ్ చేసినప్పుడు రెనో 12 ఇమేజ్ లో ఎక్కువగా గ్రెయిన్ కనిపించింది. మరోవైపు, నార్డ్ 4 లో జూమ్ చేసినప్పుడు క్లారిటీ ఉంది. క్లారిటీ, ఓవరాల్ ఇమేజ్ విషయంలో నార్డ్ 4 ముందంజలో ఉంది.
విజేత: OnePlus Nord 4
పొట్రెయిట్
రెండు ఫోన్లలో కూడా పొట్రెయిట్ షాట్స్ మెయిన్ కెమెరా ద్వారానే తీయగలం. సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ తో పొట్రెయిట్ ఎఫెక్ట్ ఇవ్వబడుతుంది. రెండు ఫోన్లు కూడా ఎడ్జ్ డిటెక్షన్‌ను బాగానే హ్యాండిల్ చేశాయి. బ్యాగ్రౌండ్ నుంచి సబ్జెక్ట్ ను క్లియర్ గా సెపరేట్ చేశాయి. నార్డ్ 4 లో స్కిన్ టోన్ బ్యాలన్స్‌డ్ గా ఉంది. రెనో 12 లో కొంచెం బ్లష్ ఉంది. నార్డ్ 4 ఫేషియల్ డీటెయిల్స్ ను ఎక్కువగా క్యాప్చర్ చేయగా, రెనో 12 వాటిని సాఫ్ట్ చేసింది.
విజేత: OnePlus Nord 4
సెల్ఫీ
ఒప్పో రెనో 12 లో 32ఎంపి హై రెజుల్యూషన్ లెన్స్ ఉంది. మరోవైపు, వన్‌ప్లస్ నార్డ్ 4 లో 16ఎంపి కెమెరా ఉంది. రెండు ఫోన్లు కూడా హ్యూమన్ సబ్జెక్ట్స్ ను బాగా హ్యాండిల్ చేశాయి. రెనో 12 లో స్కిన్ టో బ్రైట్ గా ఉండి, డీటెయిల్స్ మిస్ అయ్యాయి. మరోవైపు, వన్‌ప్లస్ నార్డ్ 4 నేచురల్ స్కిన్ టోన్ అందించింది. అయితే, ఇమేజ్ కాస్త సాఫ్ట్ గా ఉంది.
ఒప్పో రెనో 12 తో పోల్చితే, నార్డ్ 4 స్కిన్ టెక్షర్ ను ఎక్కువగా క్యాప్చర్ చేసింది. వైట్ బ్యాలన్స్ కూడా నార్డ్ 4 లో బాగుంది. మరోవైపు, రెనో 12 ఫోటోలు చూడటానికి మసకగా ఉన్నాయి.
విజేత: OnePlus Nord 4
లో-లైట్ (నైట్ మోడ్ ఆఫ్)
రెండు ఫోన్లలో లో-లైట్ పెర్ఫామెన్స్ టెస్ట్ చేసేందుకు, మేం నైట్ మోడ్ ఆఫ్ చేసి పిక్చర్స్ తీశాం. నైట్ మోడ్ ఆన్ లో లేకపోయినా, వన్‌ప్లస్ నార్డ్ 4 లాంగ్ ఎక్స్‌పోజర్ వాడుతోంది. దీని ద్వారా ఇమేజ్ క్వాలిటీ బాగుంది. రెనో 12 తో పోల్చితే, నార్డ్ 4 ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేయడంతో పాటు, మంచి క్లారిటీని అందిస్తోంది. నార్డ్ 4 తో తీసిన ఇమేజెస్ లో టెక్స్ట్ చదివేందుకు వీలుగా, కచ్చితత్వంతో ఉంది. మరోవైపు, రెనో 12 కూడా లెన్స్ ఫ్లేర్స్ కంట్రోల్ చేయడంలో నార్డ్ 4 తో పోల్చితే మంచి పనితీరు చూపింది.
విజేత: OnePlus Nord 4
లో-లైట్ (నైట్ మోడ్ ఆన్)
నైట్ మోడ్ ఆన్ చేసినప్పుడు రెనో 12 లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. డీటెయిల్స్ షార్ప్ గా, కలర్స్ రియలిస్టిక్ గా, టెక్స్ట్ చదివేందుకు తేలిగ్గా ఉన్నాయి. మరోవైపు, వన్‌ప్లస్ నార్డ్ 4 లో నైట్ మోడ్ షాట్స్, నాన్-నైట్ మోడ్ షాట్స్ దాదాపుగా మాదిరే ఉన్నాయి. ఇందులో మార్పేమీ లేదు. ఇక్కడ నార్డ్ 4 కి కాస్త పైచేయి ఉంది. నియాన్ సైన్స్ మరియు ఓవరాల్ క్లారిటీ విషయాల్లో నార్డ్ 4 బెటర్ గా ఉంది.
విజేత: OnePlus Nord 4
ఏది బెటర్?
OPPO Reno 12 తో కెమెరా టెస్టులో OnePlus Nord 4 క్లియర్ విన్నర్ అని అర్థమవుతోంది. అన్ని సందర్భాల్లోనూ నార్డ్ 4 బెటర్ కెమెరా ఫోన్ అని చెప్పవచ్చు. పొట్రెయిట్ షాట్స్, లో-లైట్ ఇమేజెస్, సెల్ఫీస్ లేదా అల్ట్రావైడ్ షాట్స్ అన్నీ కూడా నార్డ్ 4 లో బాగున్నాయి. మీరు గనుక, రూ.30,000 లోపు కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే, ఈ రెండు ఫోన్లలో OnePlus Nord 4 బెటర్ చాయిస్ అవుతుంది.