
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది లాంచ్ చేసిన Nord CE 3 5G ధరను ప్రస్తుతం తగ్గించింది. రూ.9,000 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో తక్కువ ధరకే ఈ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు లభించనుంది. అంతే కాదు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. OnePlus Nord CE 3 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OnePlus Nord CE 3 5G ధర, ఆఫర్లు
OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.9,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ని కేవలం రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకి మీకు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.26,999 గా ఉంది.
అంతేకాదు, ఫుల్ పేమెంట్ చేసి ఫోన్ కొనేవారికి అదనంగా రూ.1,250 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.16,749 లేదా రూ.16,499 కి తగ్గనుంది. అయితే, మీరు ఎంచుకునే పేమెంట్ విధానాన్ని బట్టి ఈ ధర మారుతుంది.
పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.17,050 వరకు బోనస్ పొందవచ్చు. అయితే మీ ఫోన్ కండీషన్ పై ఈ విలువ మొత్తం నిర్ణయించబడుతుంది.
కలర్స్ విషయానికి వస్తే, OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 3 5G ని కొనవచ్చా?
OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ డివైజ్. ఈ ఫోన్ డిఫరెంట్ డిజైన్, మంచి పెర్ఫామెన్స్, కెమెరా సిస్టమ్ ను ఆఫర్ చేస్తుంది. గతేడాది జులై నెలలో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. రూ.17,000 లోపు ధరలో లభిస్తోన్న ఈ ఫోన్‌ని కచ్చితంగా మీరు కన్సిడర్ చేయవచ్చు.
OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OnePlus Nord CE 3 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 కలర్ గ్యామట్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
ప్రాసెసర్: OnePlus Nord CE 3 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంది.
ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: OnePlus Nord CE 3 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: OnePlus Nord CE 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.











