
OnePlus భారతదేశంలో Nord 3 5G లాంచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ డివైజ్ భారతదేశంలోని నార్డ్ సిరీస్‌లో కంపెనీ యొక్క అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అవుతుంది. OnePlus ఈ ఏడాది చివర్లో Nord సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త లీక్ ప్రకారం, OnePlus సంస్థ Nord CE 3 5G ఇండియా లాంచ్ దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. OnePlus తన కొత్త కోర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి వివరాలను ధృవీకరించలేదు. అయితే, టిప్‌స్టర్ ముకుల్ శర్మ (స్టఫ్‌లిస్టింగ్స్), నార్డ్ CE 3 యొక్క స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు.
Nord CE 3 5Gకి Ziti అనే కోడ్ నేమ్ పెట్టబడిందని శర్మ పేర్కొన్నారు. ఫ్లాగ్‌షిప్ OnePlus 11 5Gలో కనిపించే అదే ప్రైమరీ కెమెరాను ఫోన్‌లో కలిగి ఉంటుందని టిప్‌స్టర్ వెల్లడించారు. OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇతర వివరాలను చూద్దాం.
OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- చిప్సెట్: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782 ప్రాసెసర్ వాడనున్నారని లీక్స్ ద్వారా తెలిసింది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 16జిబి వరకు ర్యామ్-వీటా, (వర్చువల్ ర్యామ్), హైపర్ టచ్, హైపర్ బూస్ట్ ఉంటాయి.
- డిస్ప్లే: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 950 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- బ్యాటరీ: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
- కెమెరా: OnePlus Nord CE 3 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 చిప్సెట్ ఉంటుంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి.
- కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, ఎన్ఎఫ్‌సీ, అలర్ట్ స్లైడర్ ఉంటాయి.
- ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
- కలర్ ఆప్షన్స్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆక్వా సర్జ్ మరియు గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











