108MP కెమెరా, Snapdragon 695 చిప్సెట్ తో వస్తోన్న OnePlus Nord CE 3 5G

హైలైట్స్

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OnePlus Nord CE 3 5G
  • గత మోడల్స్ తో పోల్చితే కొన్ని అప్‌గ్రేడ్స్ తో వస్తోన్న OnePlus Nord CE 3 5G
  • భారత్ లో OnePlus Nord CE 3 5G ధర రూ.25,000 గా ఉండే అవకాశం

త్వరలో OnePlus కంపెనీ ఓ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని వన్‌ప్లస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుబాటు ధరలో అన్ని ముఖ్యమైన ఫీచర్లను అందించడమే నార్డ్ సీఈ సిరీస్ లక్ష్యం. ఇదివరకు ఈ సిరీస్ లో వచ్చిన ఫోన్లు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వాటికి సక్సెసర్ గా OnePlus Nord CE 3 5G వస్తోంది. ఈ ఏడాది లేదు వచ్చే సంవత్సరం OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

OnePlus Nord CE 3 5G లాంచ్ తేదీ గురించి ఇప్పటి వరకు అధికార సమాచారం ఏమీ బయటకు రాలేదు. అయితే లీక్స్ ద్వారా స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ గురించి వివరాలు తెలుస్తున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ OnLeaks, GadgetGang సౌజన్యంతో OnePlus Nord CE 3 5G కి సంబంధించిన ఎన్నో విషయాలను రివీల్ చేసింది. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OnePlus Nord CE 3 5G వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వస్తోన్న ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్. భారత్ లో వచ్చే ఏడాది ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ చెబుతున్న దాన్ని బట్టి, OnePlus Nord CE 3 5G స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. OnePlus Nord CE 3 5G స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే చిప్సెట్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ లో కూడా ఉంది.

OnePlus Nord CE 3 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ లో ఉన్న 6.4-ఇంచ్ డిస్ప్లే కంటే ఇది పెద్దది. అయితే అమోలెడ్ ప్యానెల్ కి బదులు ఈసారి ఎల్సీడీ ప్యానెల్ ని తీసుకొచ్చి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ని వన్‌ప్లస్ డీగ్రేడ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. అయితే OnePlus Nord CE 3 5G లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండనుంది.

OnePlus Nord CE 3 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. ఇందులో 108 ఎంపి మెయిన్ కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.

భారత్ లో OnePlus Nord CE 3 5G ధర రూ.25,000 ఉండనుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే వన్ ప్లస్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.