
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ రేపటి నుంచి భారత మార్కెట్ లో సేల్ కి వస్తోంది. ఏప్రిల్ 4 వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచైంది. ఏప్రిల్ 11 న (రేపు) ఈ ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది. వన్‌ప్లస్ ఫోన్ల పట్ల ఆసక్తి ఉంటే గనుక, ఇక్కడ మేం OnePlus Nord CE 3 Lite 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర, సేల్ తదితర వివరాలు అందించాం. ఒకసారి చదివి తెలుసుకోండి.
OnePlus Nord CE 3 Lite 5G ధర
- 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.19,999
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = రూ.21,999
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. 128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ఇకపోతే టాప్ వేరియంట్ 256జిబి మోడల్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ క్రొమాటిక్ గ్రే మరియు పేస్టెల్ లైమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OnePlus Nord CE 3 Lite 5G సేల్ ఆఫర్
OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ సేల్ ఏప్రిల్ 11 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై వన్‌ప్లస్ సంస్థ OnePlus Nord Buds CE ని ఉచితంగా అందిస్తోంది. వీటి ధర రూ.2,299. అంతేకాదు, ఐసీఐసీఐ కార్డ్ పై రూ.1,000 అదనపు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. రెడ్ కేబుల్ క్లబ్ ద్వారా, కస్టమర్లు 6 నెలల స్పాటిఫై ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ని పొందవచ్చు.
OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- ఎల్సీడీ ప్యానెల్ స్క్రీన్
OnePlus Nord CE 3 Lite 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ స్టైల్డ్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఐ కంఫర్ట్, స్క్రీన్ కలర్ టెంపరేచర్, 680 నిట్స్ బ్రైట్నెస్, 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 16.8 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
ప్రాసెసర్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
- ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్
- 8జిబి వర్చువల్ ర్యామ్
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. 8జిబి ఇంటర్నల్ ర్యామ్ తో కలిపితే యూజర్ కి 16జిబి ర్యామ్ లభిస్తుంది. ఇక గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో జీపీయూ వాడారు.
కెమెరా
- 108ఎంపి రియర్ కెమెరా
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
OnePlus Nord CE 3 Lite 5G లో ఫోటోగ్రఫీ కోసం, 108ఎంపి శాంసంగ్ ఎచ్ఎమ్6 మెయిన్ సెన్సర్ ఉంటుంది. దీంతో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. 6x జూమ్, ఏఐ సీన్ ఎన్హాన్స్‌మెంట్ మరియు హెచ్డీఆర్ ఈ కెమెరాలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్
OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 80 శాతం చార్జ్ అవ్వడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. బ్యాటరీ హెల్త్ ఇంజిన్, బిల్ట్-ఇన్ టెంపరేచర్ సెన్సర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇవి ఫోన్ వేడెక్కడం మరియు ఓవర్ చార్జ్ వంటి వాటి నుంచి ఫోన్ ని రక్షిస్తాయి.
కనెక్టివిటీ
- 9 5జీ బ్యాండ్స్
- యూఎస్బీ 2.0 టైప్-సీ
OnePlus Nord CE 3 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, 9 5జీ బ్యాండ్స్, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











