OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఇటీవలె భారత్ లో లాంచైది. ఈ ఫోన్ ధర రూ.19,999 మాత్రమే. మీరు గనుక ఈ బడ్జెట్ లో ఒక కొత్త ఫోన్ కొనాలని భావిస్తుంటే, OnePlus Nord CE 3 Lite 5G ఉత్తమమైన ఎంపిక అవుతుంది. మరి ఇదే ఎందుకు బెటర్? అనే విషయానికి 5 కారణాలను మేం చెబుతున్నాం. మీకు కూడా ఆ కారణాలు సరైనవేననిపిస్తే, అప్పుడు OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ ని ప్రయత్నించవచ్చు.
సరే పదండి, ఓసారి OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ లో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం.
OnePlus Nord CE 3 Lite 5G లోని టాప్ 5 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- ఎల్సీడీ ప్యానెల్ స్క్రీన్
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ (2400*1080) డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఎల్సీడీ ప్యానెల్ పై డిస్ప్లే తయారైంది. ఈ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ 680 నిట్స్ బ్రైట్నెస్, 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 16.8 మిలియన్ కలర్స్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే ఐ కంఫర్ట్ మరియు స్క్రీన్ కలర్ టెంపరేచర్ అనే ఫీచర్స్ ని కలిగి ఉంది.
OnePlus Nord CE 3 Lite 5G కెమెరా
- 108ఎంపి శాంసంగ్ రియర్ కెమెరా
- 16ఎంపి సెల్ఫీ కెమెరా
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో బ్యాక్ ప్యానెల్ పై 108ఎంపి మెయిన్ కెమెరా ఉంది. ఇందులో శాంసంగ్ హెచ్ఎమ్6 సెన్సర్ ని వాడారు. ఇది 6పి లెన్స్. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. రియర్ కెమెరా లో 6ఎక్స్ జూమ్, ఏఐ సీన్ ఎన్హాన్స్‌మెంట్, హెచ్డీఆర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి కెమెరా అందించారు.
OnePlus Nord CE 3 Lite 5G ప్రాసెసర్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
- ఆక్సిజన్ ఓఎస్ 13.1
- 8జిబి వర్చువల్ ర్యామ్
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ తో లాంచైంది. ఈ ఫోన్ లో ప్రాసెసింగ్ కోసం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ 6నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఇంటర్నల్ ర్యామ్ అందించారు. అంటే యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభిస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619జీపీయూ వాడారు.
OnePlus Nord CE 3 Lite యొక్క 5జీ కనెక్టివిటీ
- 9 5జీ బ్యాండ్స్
- యూఎస్బీ 2.0 టైప్-సీ
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఎయిర్టెల్, జియో అందించే 5జీ నెట్వర్క్ ని పూర్తిస్థాయిలో వాడుకోవచ్చన్నమాట. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ సపోర్ట్ ని కలిగి ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ వంటివి ఈ ఫోన్ లో ఉన్నాయి.
OnePlus Nord CE 3 Lite 5G బ్యాటరీ, చార్జింగ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇందులో 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 30 నిమిషాల్లో ఫోన్ ని 80 శాతం చార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాకప్ ని ఎక్కువ సమయం పాటు అందించేందుకు, ఓవర్ చార్జింగ్ మరియు హీటింగ్ సమస్యలను తొలగించేందుకు ఈ ఫోన్ లో బ్యాటరీ హెల్త్ ఇంజిన్ మరియు బిల్ట్-ఇన్ టెంపరేచర్ సెన్సర్స్ అందించారు.
OnePlus Nord CE 3 Lite 5G ధర
- 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.19,999
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = రూ.21,999
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 128జిబి మెమొరీ, 8జిబి ర్యామ్ ని కలిగి ఉండగా, టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది. వీటి ధరలు వరుసగా రూ.19,999 మరియు రూ.21,999 గా ఉన్నాయి. ఈ ఫోన్ ని క్రొమాటిక్ గ్రే మరియు పేస్టెల్ లైమ్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
