OnePlus సంస్థ త్వరలో నార్డ్ సీఈ4 డివైజ్‌ని లాంచ్ చేయబోతోంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది. Nord CE 4 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 1న భారత్ లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ OnePlus Nord CE 3 కి సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో రానుంది. తాజాగా OnePlus Nord CE 4 బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
OnePlus Nord CE 4 గీక్‌బెంచ్ లిస్టింగ్
OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2613 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని MySmartPrice ముందుగా గుర్తించింది.
OnePlus Nord CE 4 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1,135 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,037 పాయింట్ స్కోర్ చేసింది.
OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లతో వస్తోంది.
OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ స్కై బ్లూ మరియు డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్
- ప్రాసెసర్: OnePlus Nord CE 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీ తో వస్తోంది.
- కలర్ ఆప్షన్స్: OnePlus Nord CE 4 డివైజ్ స్కై బ్లూ మరియు డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
OnePlus Nord CE 4 డిజైన్
OnePlus Nord CE 4 లో బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా కెమెరా మాడ్యూల్ ఉంటుంది. మాడ్యూల్ లో సెన్సర్స్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
OnePlus Nord CE 4 డివైజ్ కి టాప్ లో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. కుడివైపు ఫ్రేమ్ పై పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఉంటాయి.
