ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక లైట్ వర్షన్ ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ మలేషియాకు చెందిన ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
OnePlus Nord CE 4 Lite 5G సర్టిఫికేషన్ వివరాలు
OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ మలేషియాకు చెందిన SIRIM సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై CPH2621 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
OnePlus Nord CE 4 Lite 5G సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.
OnePlus Nord CE 4 Lite 5G ఇండియా లాంచ్ ఎప్పుడు?
OnePlus Nord CE 4 Lite 5G కొన్ని రోజుల క్రితం భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ త్వరలో భారత్ లో కూడా లాంచ్ కానుందని అర్థమవుతోంది.
OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.
ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6GHz.
కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
