OnePlus: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన Nord CE 4 Lite

Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2621

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఒక కొత్త నార్డ్ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈ డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి ఐఎండీఏ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite ఐఎండీఏ లిస్టింగ్

OnePlus యొక్క కొత్త ఫోన్ ఐఎండీఏ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తొలుత MySmartPrice గుర్తించింది.

ఐఎండీఏ లిస్టింగ్‌ని గమనిస్తే, OnePlus Nord CE 4 Lite పేరు స్పష్టంగా కనిపిస్తోంది.

ఐఎండీఏ లిస్టింగ్ ద్వారా OnePlus Nord CE 4 Lite కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. కానీ, ఈ ఫోన్ లాంచ్ త్వరలో ఉంటుందని స్పష్టమైంది.

OnePlus Nord CE 4 Lite స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ సంజు చౌదరి ద్వారా ఇటీవలె OnePlus Nord CE 4 Lite యొక్క ఇమేజ్‌ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు. ఈ ఫోన్ ధర భారత్ లో రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

Previous articleVivo: మే 20న లాంచ్ అవుతోన్న Vivo Y200t, Y200 GT
Next articleiQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.