
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఒక కొత్త నార్డ్ సీఈ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 పేరుతో ఈ ఫోన్ భారత్ లో ఏప్రిల్ 1న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.30,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లతో రానుంది. తాజాగా ఈ డివైజ్ ధర టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Nord CE 4 ధర (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ యేగేశ్ బ్రార్ తన X ఖాతా ద్వారా OnePlus Nord CE 4 వివరాలను షేర్ చేశారు.
OnePlus Nord CE 4 డివైజ్ ధర రూ.26,999 లేదా రూ.27,999 ఉండవచ్చని తన పోస్ట్ ద్వారా తెలిపారు.
OnePlus Nord CE 4 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుందని సమాచారం.
OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ డార్క్ క్రోమ్ మరియు సెలడన్ మార్బుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
మరో విషయం ఏంటంటే, OnePlus Nord CE 4 డివైజ్ 256జిబి స్టోరేజీతో రానుందని వన్‌ప్లస్ ఇప్పటికే స్పష్టం చేసింది.
OnePlus Nord CE4
(Code name: Benz)– Dark Chrome & Celadon Marble colors
– 8/128GB & 8/256GB options
– Qualcomm Snapdragon 7 Gen 3
– 100W charging
– Narrow bezel AMOLED panelCould start at : Rs 26,999 or 27,999
What are your price expectations?
— Yogesh Brar (@heyitsyogesh) March 20, 2024
OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)
- డిస్ప్లే: OnePlus Nord CE 4 లో అమోలెడ్ ప్యానెల్ ఉంటుంది. స్క్రీన్ సైజ్ ఇంకా తెలియలేదు. డిస్ప్లే ఫ్లాట్ కార్నర్స్, సన్నని బెజెల్స్, పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంటుంది.
- ప్రాసెసర్: OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ: OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.
- ఓఎస్: OnePlus Nord CE 4 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











