ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్ సిరీస్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో Nord CE 4 ని లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో దీని ధరను రూ.24,999 గా పెట్టారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది. తాజాగా ఈ ఫోన్ పై అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్ లో డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Nord CE4 ఆఫర్ వివరాలు
OnePlus Nord CE4 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది
బ్యాంక్ ఆఫర్ లో భాగంగా, అమెజాన్ మరియు వన్‌ప్లస్ వెబ్‌సైట్స్ లో ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది.
డీల్‌లో భాగంగా, కంపెనీ ఈ ఫోన్ పై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.
దీంతో OnePlus Nord CE4 బేస్ వేరియంట్ రూ.21,999 కి మరియు టాప్ మోడల్ రూ.23,999 కి లభించనున్నాయి.
OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ని డార్క్ క్రోమ్ మరియు సెలడన్ మార్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OnePlus Nord CE4 ఫోన్‌ను మీరు కొనవచ్చా?
OnePlus Nord CE4 డివైజ్ ఒక ఆల్-రౌండ్ ప్యాకేజీ. ఇప్పుడు దీనిపై డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మీరు గనుక రూ.23,000 లోపు ఫోన్ కొనదలిచితే, ఈ ఫోన్‌ని ఒక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. అంటే మల్టీటాస్కింగ్, చక్కటి యూఐ అనుభూతి వెరసి ఈ ఫోన్ మంచి ఎంపికే అవుతుంది. ఇంకా ఈ ఫోన్ లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉన్నాయి.
OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ యొక్క అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 819,347 పాయింట్లుగా ఉంది. గేమింగ్ కి ఈ ఫోన్ అనువైనదిగా చెప్పవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు ఓవర్ హీటింగ్ లేదా ల్యాగ్స్ వంటివి ఉండవు.
చిప్సెట్‌ను ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో అనుసంధానించారు. ఇది ప్రీమియమ్ పెర్ఫామెన్స్ ను అందించడంలో సాయపడుతుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అనేవి ఈ సెగ్మెంట్ లో బెస్ట్ గా ఉన్నాయి. డే లైట్ మరియు లో లైట్ పరిస్థితుల్లో OnePlus Nord CE4 లో అందించిన కెమెరాలు మంచి ఫోటోలనే తీస్తున్నాయి.
OnePlus Nord CE4 లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సాధారణ వాడకంపై, ఈ బ్యాటరీ ఒక పూర్తి రోజు బ్యాకప్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. ఫోన్ బాక్స్ లో చార్జర్ ను కూడా అందిస్తుండటం విశేషం.
