హైలైట్స్
- ఆగస్టులో గ్లోబల్ గా లాంచ్ అయిన OnePlus Nord N20 SE డివైజ్, OPPO A77 4G పేరుతో రీబ్రాండ్ అయి భారత్ కి వచ్చిన Nord N20 SE
- గ్లోబల్ మార్కెట్స్ కే పరిమితమయ్యే OnePlus Nord N20 SE, హఠాత్తుగా ఈ-కామర్స్ సైట్స్ లో ప్రత్యక్షం
- ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్స్ లో కనిపించే OnePlus Nord N20 SE లిస్టింగ్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించిన ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ
2022 ఆగస్టు లో OnePlus Nord N20 SE గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. మామూలుగా Nord-N సిరీస్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్స్ కే పరిమితమవుతాయి. ఇవి భారత్ కి రావు. కానీ ఆశ్చర్యకరంగా, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వెబ్ సైట్స్ పై OnePlus Nord N20 SE డివైజ్ దర్శనమిచ్చింది. అయితే దీనికి సంబంధించి బ్రాండ్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. అంటే ఈ ఫోన్ లిస్టింగ్ అనధికారికమైనదని అర్థమవుతోంది. అమెజాన్ లో ఎలక్ట్రానిక్-బజ్ అనే సెల్లర్ ఈ ఫోన్ ని విక్రయిస్తోంది. షిప్మెంట్ ఫుల్‌ఫిల్డ్ బై అమెజాన్ అని కూడా చూపిస్తోంది. దీనర్థం మీకు కచ్చితంగా డివైజ్ డెలివరీ అవుతుందని అర్థం.
మరోవైపు, ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ఈ విషయంపై ఓ ట్వీట్ చేశాడు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వెబ్ సైట్స్ పై కనిపిస్తోన్న OnePlus Nord N20 SE లిస్టింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. బ్రాండ్ తరపున అధికారికంగా ఆ లిస్టింగ్ చేర్చబడలేదని, అలాగే బ్రాండ్ వ్యారంటీ కూడా లేదని అతడు తెలిపాడు. ఫోన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్ లో విక్రయిస్తున్నారని ముకుల్ చెప్పాడు.
భారత్ లో OnePlus Nord N20 SE
OnePlus Nord N20 SE అధికారికంగా భారత్ లో లాంచ్ కాలేదు. అయితే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఫోన్లను ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లో విక్రయిస్తున్నారు. అంటే ఇలా కొనుగోలు చేసే డివైజెస్ కి వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి After-sale సపోర్ట్ ఉండదు. అంటే ఏదైనా రిపెయిర్ వస్తే వన్‌ప్లస్ కి సంబంధం ఉండదన్నమాట. అంటే డిస్ప్లే పగిలినా, ఇంకేదైనా సమస్య వచ్చినా మీరే సొంతంగా బాగు చేయించుకోవాల్సి ఉంటుంది.
రూ.15,000 పెట్టి ఫోన్ ని కొంటున్నప్పుడు కనీసం వ్యారంటీ లేకపోతే ఎలా? కాబట్టి అనధికారికంగా లభిస్తోన్న OnePlus Nord N20 SE ఫోన్ ని కొనడం కంటే, OPPO A77 4G ఫోన్ ని కొనడం బెటర్. ఎందుకంటే A77 4G కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంటుంది.
OPPO A77 4G స్పెసిఫికేషన్స్
OPPO A77 4G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో 1610*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ హీలియో జీ 35 చిప్సెట్, పవర్ వీఆర్ జీఈ 8320 గ్రాఫిక్స్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OPPO A77 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్ తో వస్తోంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
OPPO A77 4G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.