వన్‌ప్లస్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ పై పని చేస్తోంది. దాని పేరు OnePlus Nord N30 5G. నార్డ్ ఎన్-సిరీస్ లో ఇది కొత్త ఫోన్. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, దీనికి సంబంధించిన లీక్స్ ఎన్నో బయటకు వచ్చాయి. వాటి ద్వారా ఫోన్ లుక్, డిజైన్, ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలిసాయి. ఈ వివరాలను కలిపి ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివేయండి.
OnePlus Nord N30 5G డిజైన్
- ఫ్లాట్ ఎడ్జ్ స్క్రీన్
- 0.83 సె.మీ. మందం
లీకైన ఫోటోలను బట్టి, OnePlus Nord N30 5G డివైజ్ ఫ్లాట్ ఎడ్జ్ స్క్రీన్, బెజెల్-లెస్ ఎడ్జెస్ మరియు సన్నని చిన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ లో పంచ్-హోలట్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ 0.83 సెంటీమీటర్ల మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.
బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరా సెన్సర్స్ కనిపిస్తున్నాయి. కెమెరా సెటప్ ఫోన్ వెనకాల పై భాగాన ఎడమవైపున ఉంది. బ్యాక్ ప్యానెల్ షైనీ మరియు గ్లాసీ గా ఉంది. వాల్యూమ్ రాకర్ కుడివైపున ఉండగా, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎడమవైపున ఉంది. అదే విధంగా యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ బాటమ్ ప్యానెల్ లో ఉన్నాయి.
OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో ఐ కంఫర్ట్, స్క్రీన్ కలర్ టెంపరేచర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రాసెసర్, ర్యామ్
- 8జిబి వర్చువల్ ర్యామ్
- స్నాప్ డ్రాగన్ 695
OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. లీక్స్ నిజమే అయితే గనుక, ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ సంస్థ ఈ ఫోన్ ని 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ తో లాంచ్ చేయనుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్ లో 1టిబి వరకు మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకునే వీలుంది.
కెమెరా విభాగం
- 108ఎంపి రియర్ కెమెరా
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇది శాంసంగ్ హెచ్ఎమ్6 సెన్సర్ అని భావిస్తున్నారు. దీనికి తోడు 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
