AMOLED డిస్ప్లే, 16GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Open

Highlights

  • నేడు భారత్ లో లాంచైన OnePlus Open
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వచ్చిన ఫోన్
  • OnePlus Open ధర రూ.1,39,999

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇదే ఫోన్ నేడు చైనాలో Oppo Find N3 పేరుతో లాంచ్ అయ్యింది. ఇకపోతే OnePlus Open డివైజ్ వన్‌ప్లస్ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్. కాంపాక్ట్ బుక్-స్టైల్ ఫోల్డింగ్ డిజైన్ తో ఈ డివైజ్ వచ్చింది. ఈ ఫోన్ ఎంతో తేలికగా, సన్నగా ఉంటుందని.. తెరిచినప్పుడు మధ్యలో గీత (క్రీజ్) కనిపించదని కాబట్టి ట్యాబ్లెట్ వంటి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే OnePlus Open డివైజ్ 5 కెమెరాలు, అలర్ట్ స్లైడర్ తో వచ్చింది.

భారత్‌లో OnePlus Open ధర, సేల్ తేదీ

  • భారత్ లో OnePlus Open 16జిబి+512జిబి వేరియంట్ ధరను రూ.1,39,999 గా నిర్ణయించారు.
  • OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ వొయేజర్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ డస్క్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, రిలయన్స్ డిజిటల్ మరియు ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో OnePlus Open కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • నేటి నుంచి OnePlus Open ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. అక్టోబర్ 27 నుంచి OnePlus Open సేల్ ప్రారంభమవుతుంది.
  • ఐసీఐసీఐ మరియు వన్‌కార్డ్ హోల్డర్స్ రూ.5,000 వరకు బెనిఫిట్స్ పొందుతారు.
  • జియో రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో రూ.15,000 విలువైన ప్రయోజనాలను యూజర్ పొందవచ్చు.

OnePlus Open స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Open లో 7.82-ఇంచ్ 2కే అమోలెడ్ మెయిన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్, అల్ట్రాథిన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఫోన్ ని మూసినప్పుడు, 6.31-ఇంచ్ 120 హెర్ట్జ్ 2కే అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది సిరామిక్ గార్డ్ తో వస్తోంది.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి/8జిబి/12జిబి వరకు ర్యామ్ ఎక్స్‌పాన్షన్ సౌకర్యం కూడా ఉంది.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి సోని ఎల్‌వైటీ-టీ808 ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి ప్రైమరీ ఫ్రంట్ కెమెరా, 32ఎంపి సెకండరీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,805 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బాక్స్ లో 80 వాట్ సూపర్‌వూక్ అడాప్టర్ ని కంపెనీ అందిస్తోంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Open లో 5జీ, వై-ఫై 6ఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, అలర్ట్ స్లైడర్, డాల్బి అట్మాస్ ఉన్నాయి.