Home News OnePlus Open Apex: 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో భారత్‌లో లాంచైన వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్

OnePlus Open Apex: 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో భారత్‌లో లాంచైన వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్

Highlights
  • భారత్‌లో OnePlus Open Apex ఎడిషన్ లాంచ్
  • అప్‌గ్రేడెడ్ ఫీచర్స్ తో వచ్చిన కొత్త ఓపెన్ అపెక్స్
  • వీఐపీ ప్రైవసీ మోడ్, 1టిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus Open Apex ఎడిషన్ ను లాంచ్ చేసింది. కొన్ని అప్‌గ్రేడెడ్ ఫీచర్స్ తో ఈ ఫోన్‌ని వన్‌ప్లస్ తీసుకొచ్చింది. ఇందులో వీఐపీ ప్రైవసీ మోడ్, 1టిబి స్టోరేజీ, డెడికేటెడ్ సెక్యూరిటీ చిప్ ఉన్నాయి. అంతేకాదు, ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో అందించారు. సరే, ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Open Apex ఎడిషన్ ధర మరియు లభ్యత

OnePlus Open Apex ఎడిషన్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ వేరియంట్ ధరను భారత్ లో రూ.1,49,999 గా నిర్ణయించారు. బేస్ వేరియంట్ ధర రూ.1,39,999 గా ఉంది.

ఆగస్టు 10వ తేదీ నుంచి భారత్ లో OnePlus Open Apex ఎడిషన్ సేల్ ప్రారంభమవుతుంది. కస్టమర్లు ఈ ఫోన్‌ని వన్‌ప్లస్ అఫీషియల్ వెబ్‌సైట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OnePlus Open Apex కొనే కస్టమర్లకు 3 నెలల మైక్రోసాఫ్ట్ 365 పర్సనల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

ఆఫర్ లో భాగంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొంటే, రూ.20,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

OnePlus Open Apex ఎడిషన్ కొత్తగా వచ్చినవేంటి?

OnePlus Open Apex ఎడిషన్ లో క్రిమ్సన్ రెడ్ షేర్ ప్రీమియమ్ లెదర్ బ్యాక్ ప్యానెల్, ఏఐ ఎరేజర్, ఏఐ స్మార్ట్ కటౌట్ ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్, ప్రైవసీ కోసం వీఐపీ మోడ్, డెడికేటెడ్ సెక్యూరిటీ చిప్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

OnePlus Open Apex స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Open Apex ఎడిషన్ లో 7.82-ఇంచ్ 2కే అమోలెడ్ ప్రైమరీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ లో 6.31-ఇంచ్ 2కే అమోలెడ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సిరామిక్ గార్డ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Open Apex ఎడిషన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. అడ్రెనో 740 జీపీయూ గ్రాఫిక్స్ అందించారు.

మెమొరీ: OnePlus Open Apex డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Open Apex ఎడిషన్ లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 64ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 48ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus Open Apex ఎడిషన్ లో పవర్ బ్యాకప్ కోసం 4805 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 67 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OnePlus Open Apex ఎడిషన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: OnePlus Open Apex ఎడిషన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.