Home News అక్టోబర్ 19 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Open; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి!

అక్టోబర్ 19 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Open; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Open
  • అక్టోబర్ 19 న భారత్ లోకి ఎంట్రీ
  • 100 వాట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలోనే తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో అక్టోబర్ 19 న లాంచ్ అవుతోంది. OnePlus Open డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 7.82-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం. OnePlus Open లాంచ్ ఈవెంట్ ముంబై నగరంలో అక్టోబర్ 19 న రాత్రి 7.30 గంటలకు జరగనుంది. OnePlus Open డివైజ్ సన్నని డిజైన్, అలర్ట్ స్లైడర్ కలిగి ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Open డివైజ్ ని ఈవెంట్ జరిగే చోట లేదా వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ లేదా వన్‌ప్లస్ స్టోర్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే, OnePlus Buds Pro 2 ని ఉచితంగా పొందే ఆఫర్ ని కంపెనీ ప్రకటించింది.

OnePlus Open ధర

OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ధర యూఎస్ మార్కెట్ లో 1,700 డాలర్లు (సుమారు రూ.1,41,500) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తుందని సమాచారం. సరే, ఓసారి OnePlus Open డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

OnePlus Open స్పెసిఫికేషన్స్