Home News త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus Open; అఫీషియల్ గా టీజ్ చేసిన ఒప్పో!

త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus Open; అఫీషియల్ గా టీజ్ చేసిన ఒప్పో!

Highlights
  • OnePlus Open ని టీజ్ చేసిన ఒప్పో
  • అక్టోబర్ 19 న భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • 8 జెన్ 2 చిప్ తో వస్తోన్న OnePlus Open

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని లాంచ్ చేయబోతోంది. తాజాగా OnePlus Open టీజర్ ని సోషల్ మీడియాలో వదిలింది వన్‌ప్లస్ సంస్థ. భారత్ లో ఏ తేదీన లాంచ్ కానుందో ఇంకా కచ్చితంగా తెలియదు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేతిలో OnePlus Open ఫోన్ కనిపించింది. దీంతో అతి త్వరలో భారత్ లో OnePlus Open ఫోన్ లాంచ్ అవుతుందని అర్థమైంది.

OnePlus Open స్మార్ట్‌ఫోన్ భారత్ లో అక్టోబర్ మూడో వారంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. OnePlus షేర్ చేసిన టీజర్ ఇమేజ్ లో OnePlus Open అలర్ట్ స్లైడర్ తో కనిపిస్తోంది.

OnePlus Open ఇండియా లాంచ్ వివరాలు

OnePlus ఇండియా తన X ఖాతా ద్వారా రీసెంట్ గా చేసిన పోస్ట్ లో “ఏ ట్రూ వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ అవెయిట్స్. ఓపెనింగ్ సూన్.” అని రాసి ఉంది. ఇక క్యాప్షన్ తో పాటు ఉన్న ఇమేజ్ లో ఫోల్డబుల్ బుక్-స్టైల్ డిజైన్ కనిపిస్తోంది. ఇది చూడటానికి Samsung Galaxy Z Fold 5 మాదిరి ఉంది. ఇక OnePlus Open మరియు OPPO Find N3 డివైజెస్ ఒకటేనని ఇటీవలె కన్ఫర్మ్ అయ్యింది. అయితే OPPO Find N3 కేవలం చైనా మార్కెట్ కే పరిమితం కానుంది. కానీ, OnePlus Open భారత్ లో లాంచ్ అవ్వనుంది.

భారత్ లో OnePlus Open డివైజ్ అక్టోబర్ 19 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, వన్‌ప్లస్ నుంచి దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

భారత్ లో OnePlus Open ధర (అంచనా)

టిప్‌స్టర్స్ ప్రకారం, OnePlus Open ధర భారత్ లో రూ.1,10,000 నుంచి రూ.1,20,000 మధ్య ఉంటుందని సమాచారం. OnePlus Open డివైజ్ ధర Samsung Galaxy Z Fold 5 కంటే తక్కువే కానీ, ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్ గానే పరిగణించబడుతుంది.