Home News లాంచ్‌కి ముందు రివీలైన OnePlus Open రెండర్స్, ధర!

లాంచ్‌కి ముందు రివీలైన OnePlus Open రెండర్స్, ధర!

Highlights
  • అక్టోబర్ 19 న భారత్ లో OnePlus Open లాంచ్ అయ్యే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తోన్న OnePlus Open
  • రెండర్స్ ద్వారా రివీలైన బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా OnePlus Open యొక్క రెండర్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. రెండర్స్ ద్వారా బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఇకపోతే భారతీయ మార్కెట్ లో OnePlus Open డివైజ్ అక్టోబర్ 19 న లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

OnePlus Open రెండర్స్ ని Winfuture రివీల్ చేసింది. దీంతో OnePlus Open యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలిసాయి. సరే, ఓసారి OnePlus Open రెండర్స్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

రివీలైన OnePlus Open రెండర్స్

తాజాగా లీకైన OnePlus Open రెండర్స్ ద్వారా బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. వీటిలో బ్లాక్ కలర్ వేరియంట్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తుండగా, గ్రీన్ కలర్ వేరియంట్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. హ్యాండ్సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తున్నట్లు రెండర్స్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Open ధర (అంచనా)

OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ధర యూఎస్ మార్కెట్ లో 1,700 డాలర్లు (సుమారు రూ.1,41,500) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తుందని సమాచారం. సరే, ఓసారి OnePlus Open డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)