Home News త్వరలో భారత్ లో OnePlus Open లాంచ్ అయ్యే అవకాశం, అనుష్క శర్మ చేతిలో కనిపించిన డివైజ్!

త్వరలో భారత్ లో OnePlus Open లాంచ్ అయ్యే అవకాశం, అనుష్క శర్మ చేతిలో కనిపించిన డివైజ్!

Highlights
  • 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో రానున్న OnePlus Open
  • అక్టోబర్ 19 న లాంచ్ అవుతుందని అంచనా
  • తాజాగా అనుష్క శర్మ చేతిలో కనిపించిన OnePlus Open

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో భారతీయ మార్కెట్ లో OnePlus Open డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. అయితే ఇంకా కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ, తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేతిలో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ కనిపించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. సరే, ఓసారి OnePlus Open డివైజ్ వైరల్ వీడియో వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

OnePlus Open వీడియో విశేషాలు

OnePlus Open లాంచ్ తేదీ (అంచనా)

OnePlus Open లాంచ్ టైమ్‌లైన్ కి సంబంధించిన సమాచారం అక్టోబర్ 19 న వెల్లడవుతుందని తెలుస్తోంది. అసలైతే, ఈ ఫోన్ ఆగస్టు నెలలోనే లాంచ్ కావాల్సింది. కానీ, వాయిదా పడింది. డిస్ప్లే తయారీదారు మార్పుతో ఈ జాప్యం జరిగింది. అయితే ఇంకా లాంచ్ ప్రకటన అధికారికంగా వెలువడాల్సి ఉంది. త్వరలోనే వన్‌ప్లస్ సంస్థ ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)