హైలైట్స్:
- త్వరలో భారత్ లో లాంచ్ కానున్న వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్
- నార్డ్ బడ్స్, నార్డ్ వాచ్, నార్డ్ మీజరింగ్ స్కేల్ ని కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వన్ ప్లస్
- ఇంకా వెల్లడి కాని ఈ ఉత్పత్తుల యొక్క లాంచ్ తేదీ
వన్ ప్లస్ బ్రాండ్ తన నార్డ్ లైన్ ప్రోడక్ట్స్ ని కేవలం స్మార్ట్ ఫోన్స్ కే పరిమితం చేయట్లేదు. టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ తో సహా మరెన్నో ఉత్పత్తులను నార్డ్ వరుసలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. టిప్ స్టర్ ముకుల్ శర్మ చెబుతున్న దాన్ని బట్టి, మరెన్నో నార్డ్ బ్రాండెడ్ ఏఐఓటీ ప్రోడక్ట్స్ లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇక నార్డ్ 2 కి సక్సెసర్ గా నార్డ్ 3 వస్తోంది. ఈసారి నార్డ్ 3 లో పలు అప్‌గ్రేడ్స్ ని అందిచబోతున్నట్లు తెలుస్తోంది.
జరుగుతోన్న పరిణామాలను బట్టి చూస్తుంటే, వన్ ప్లస్ బ్రాండింగ్ ను కేవలం ప్రీమియమ్ ఫోన్స్, ఆడియో డివైజెస్ కి పరిమితం చేసి, నార్డ్ సిరీస్ ను బడ్జెట్/మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్స్, ఆడియో, వేరబుల్స్ కి కేటాయించాలని వన్ ప్లస్ కంపెనీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Nord 3
Nord Watch
Nord Band
New Nord Buds
Nord smart measuring scale (not sure of the name)
and more Nord-branded AIoT products coming up.— Mukul Sharma (@stufflistings) August 19, 2022
2022 లో లాంచ్ కానున్న OnePlus Nord ఉత్పత్తులు
టిప్ స్టర్ ముకుల్ శర్మ చెబుతున్న దాన్ని బట్టి, వన్ ప్లస్ త్వరలోనే భారత్ లో వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కచ్చితమైన లాంచ్ టైమ్ లైన్ ఇంకా రివీల్ కాలేదు. ఫోన్ తో పాటు, నార్డ్ వాచ్ కూడా లాంచ్ కానుంది. దీని ధర వన్ ప్లస్ వాచ్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒరిజినల్ వన్ ప్లస్ వాచ్ నుంచి హార్ట్ రేట్ సెన్సర్, ఎస్పీఓ2 మానిటర్ వంటి మరెన్నో ఫీచర్లను నార్డ్ వాచ్ లో మనం చూడవచ్చు.
నార్డ్ 3 ఫోన్, నార్డ్ వాచ్ తో పాటు స్మార్ట్ స్కేల్, ఏఐఓటీ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయాలని వన్ ప్లస్ ప్లాన్ చేస్తోంది. అంటే షావోమీ, రియల్ మీ కంపెనీల బాటలో వన్ ప్లస్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. నార్డ్ లైనప్ లో మరొక టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్ రానుందని ముకుల్ శర్మ వెల్లడించాడు. నార్డ్ బడ్స్, నార్డ్ బడ్స్ సీఈ లాంచ్ తర్వాత ఈ టీడబ్ల్యూఎస్ ఎంట్రీ ఇస్తోంది. నార్డ్ బడ్స్, నార్డ్ బడ్స్ సీఈ ధరలు వినియోగదారులకు అందుబాటు ధరలోనే ఉన్నాయి.
వన్ ప్లస్ నార్డ్ 3 స్పెసిఫికేషన్స్ ఇంకా రహస్యంగానే ఉన్నాయి. అయితే అంచనా ప్రకారం, ఈ ఫోన్లో 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే 50ఎంపి ప్రైమరీ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉండనుంది. ఇంకా 5జీ కనెక్టివిటీ ఉంటుందని చెప్పవచ్చు. త్వరలోనే భారత్ లో నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ వెల్లడయ్యే అవకాశముంది.