Home News 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన OPPO A1 5G

12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన OPPO A1 5G

Highlights
  • చైనాలో లాంచైన OPPO A1 5G స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ పై పని చేయనున్న OPPO A1 5G
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన OPPO A1 5G డివైజ్

OPPO సంస్థ ఒక కొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ ని చైనా మార్కెట్ లో లాంచ్ చేసింది. OPPO A1 5G డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 12జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి OPPO A1 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A1 5G ధర

OPPO A1 5G స్మార్ట్ ఫోన్ చైనాలో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ధర గురించి మాట్లాడితే, 8జిబి ర్యామ్ యూనిట్ ధర 2099 యువాన్లు, 12జిబి ర్యామ్ వేరియంట్ ధర 2299 యువాన్లుగా ఉన్నాయి.

భారతీయ కరెన్సీ ప్రకారం, OPPO A1 5G డివైజ్ 8జిబి ర్యామ్ ధర సుమారు రూ.25,000 గా ఉంటుంది. 12జిబి ర్యామ్ మోడల్ ధర రూ.27,400 గా ఉంటుంది. OPPO A1 5G డివైజ్ క్యాబర్నెట్ ఆరెంజ్, ఓషియన్ బ్లూ, శాండ్‌స్టోన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A1 5G స్పెసిఫికేషన్స్

OPPO A1 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

OPPO A1 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 8-నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో 619ఎల్ జీపీయూ వాడారు.

OPPO A1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO A1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి.

OPPO A1 5G ఇండియా లాంచ్ స్టేటస్

OPPO A1 5G డివైజ్ ప్రస్తుతం చైనాలో లాంచ్ అయ్యింది. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం భారత్ లో ఉన్న ఒప్పో చీపెస్ట్ ఫోన్ OPPO A12 ధర రూ.7,990 గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.