Home News 50ఎంపి కెమెరా, 12జిబి ర్యామ్ తో లాంచైన OPPO A1 5G

50ఎంపి కెమెరా, 12జిబి ర్యామ్ తో లాంచైన OPPO A1 5G

Highlights
  • 4జీ, 5జీ కనెక్టివిటీతో వచ్చిన OPPO A1 5G డివైజ్
  • 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన OPPO A1 5G
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ పై పని చేయనున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా ఏ-సిరీస్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. OPPO A1 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ చైనాలో లాంచైంది. 50ఎంపి కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చింది. గతేడాది వచ్చిన OPPO A1 Pro కి డౌన్ వర్షన్ గా OPPO A1 5G వచ్చింది. సరే, ఓసారి OPPO A1 5G ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A1 5G ధర

OPPO A1 5G చైనాలో లాంచ్ అయ్యింది. ఈ 5జీ ఫఓన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ తో వచ్చింది. ఈ వేరియంట్ ధర RMB 1999 (సుమారు రూ.23,900) గా ఉంది.

OPPO A1 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

OPPO A1 5G లో 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్

OPPO A1 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఇది కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ అందించారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా

ఫోటోగ్రఫీ కోసం OPPO A1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనో పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ

OPPO A1 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

OPPO A1 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5జీ, 4జీ కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ డివైజ్ లో వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.