హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన OPPO A17 స్మార్ట్ ఫోన్
- మీడియాటెక్ హీలియో జీ35 చిప్, 4జిబి ర్యామ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్న OPPO A17
- భారత్ లో OPPO A17 ధర రూ.12,499
భారత మార్కెట్ లో OPPO A17 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. ఇక భారత్ లో OPPO A17 ధర రూ.12,499 గా నిర్ణయించబడింది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న వివో వై16 కి ఈ ఫోన్ పోటీ ఇవ్వనుంది. మిడ్ నైట్ బ్లాక్, సన్ లైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో OPPO A17 లభిస్తుంది.
OPPO A17 స్పెసిఫికేషన్స్
ఇప్పుడు OPPO A17 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. OPPO A17 గ్లోబల్ మోడల్ మాదిరి కనిపిస్తోంది. OPPO A17 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్, ఐఎంజీ జీఈ8320 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.
OPPO A17 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OPPO A17 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 5 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
OPPO A17 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి ఈఎంఎంసీ5.1 స్టోరేజీ ఉన్నాయి. OPPO A17 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12.1.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. OPPO A17 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఈ ఫోన్లో మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉంది.
OPPO A17 మిడ్నైట్ బ్లాక్, సన్ లైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, బైడూ, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. OPPO A17 ఐపీఎక్స్4 రేటింగ్ తో వస్తోంది.
OPPO A17 స్మార్ట్ ఫోన్ ని ఒప్పో ఆన్‌లైన్ స్టోర్స్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర రూ.12,499.
5జీ ఫోన్ల హవా నడుస్తోన్న ఈ రోజుల్లో 4జీ ఫోన్ ని జనాలు ఎలా ఆదరిస్తారో తెలియదు. కానీ, 5జీ ఇంకా దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు చాలా సమయం పట్టనుంది. అలాగే 5జీ లాంచ్ తర్వాత కూడా 4జీ వినియోగించే కస్టమర్లే ఎక్కువ శాతం ఉంటారని తాజాగా మోటోరోలా సంస్థ మోటో జీ72 ఫోన్ లాంచ్ సందర్భంగా తెలిపింది. అందుకే ఇటీవలి కాలంలో 4జీ బడ్జెట్ ఫోన్ల తాకిడి మార్కెట్ లో ఎక్కువైంది. మరి భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.