హైలైట్స్:
- OPPO A17k, A17, A77s అనే మూడు బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ని లాంచ్ చేయనున్న ఒప్పో
- OPPO A17k, A17, A77s ధరలు వరుసగా రూ.10,499, రూ.12,499, రూ.17,999 గా ఉంటాయని అంచనా
- MediaTek Helio G35 చిప్సెట్ తో వస్తున్న OPPO A17k, A17 ఫోన్లు
OPPO కంపెనీ త్వరలో మూడు బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవి OPPO A17k, A17, A77s. ఇటీవలె OPPO A77s స్మార్ట్ ఫోన్ వార్తల్లో నిలిచింది. 91మొబైల్స్ హిందీ ఒప్పో త్వరలోనే 3 బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలిపింది. పండుగ సీజన్లో OPPO A17k, A17, A77s ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. చూస్తుంటే మూడు ప్రైస్ సెగ్మెంట్స్ లో ఒప్పో ఫోన్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అవి: ఎంట్రీ లెవెల్, లో-బడ్జెట్ మరియు మిడ్-బడ్జెట్.
ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ద్వారా ఒప్పో ఫోన్ల ధరలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, ఫోన్ల ధరలు రూ.10,000 నుంచి రూ.18,000 మధ్య ఉంటాయని తెలుస్తోంది. మరి OPPO A17k, A17, A77s యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయో ఓసారి చూద్దాం పదండి.
భారత్ లో OPPO A17k, A17, A77s ధరలు (అంచనా)
OPPO A17k రూ.10,499 (3జిబి+64జిబి) ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. OPPO A17 విషయానికి వస్తే, ఇది రూ.12,499 (4జిబి+64జిబి) ధరతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇక OPPO A77s ధర రూ.17,999 (8జిబి+128జిబి) ఉండనుందని తెలుస్తోంది. మూడింట్లో కెల్లా ఈ మోడల్ ధర ఎక్కువగా ఉంది.
OPPO A17k స్పెసిఫికేషన్స్ (అంచనా)
OPPO A17k లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1, 3జిబి/4జిబి ర్యామ్, ర్యామ్ ప్లస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.29 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
OPPO A17 స్పెసిఫికేషన్స్ (అంచనా)
OPPO A17 లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 4జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ ప్లస్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
OPPO A77s స్పెసిఫికేషన్స్
OPPO A77s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5జిబి వర్చువల్ ర్యామ్, 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్ వూక్ చార్జింగ్, గ్లో డిజైన్ టెక్నాలజీ, స్క్రాచ్ రెసిస్టంట్ బ్యాక్ ప్యానెల్, అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్స్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, హెచ్డీఆర్ సపోర్ట్ ఉన్నాయి. OPPO A77s 7.99 మిల్లీ మీటర్ల మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది. OPPO A77s ఒక 4జీ హ్యాండ్సెట్.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.