Home News 5000mAh బ్యాటరీ, MediaTek Helio G35 చిప్సెట్ తో లాంచ్ అయిన OPPO A17k

5000mAh బ్యాటరీ, MediaTek Helio G35 చిప్సెట్ తో లాంచ్ అయిన OPPO A17k

హైలైట్స్

OPPO A17k స్మార్ట్ ఫోన్ లాంచ్ తో ఒప్పో కంపెనీ భారత్ లో తన ఏ-సిరీస్ లైనప్ ని విస్తరించింది. కొత్తగా లాంచ్ అయిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ అయిన OPPO A17 తో OPPO A17k జత చేరింది. ఇప్పుడు ఏ17 సిరీస్ లో రెండు హ్యాండ్సెట్స్ ఉన్నాయి. రెండు ఫోన్లలో OPPO A17k అత్యంత చౌకైన ఫోన్.

OPPO A17k సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. అలాగే రెండు కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఇంకా ఈ ఫోన్ యొక్క సేల్ వివరాలను వెల్లడించలేదు. ఈలోపు, భారత్ లో OPPO A17k యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO A17k ధర, స్పెసిఫికేషన్స్

3జిబి ర్యామ్ వేరియంట్ లో OPPO A17k స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ప్రస్తుతం భారత్ లో ఇదొక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ ఫోన్ లో 64జిబి స్టోరేజీ ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ ధర రూ.10,499 గా నిర్ణయించారు. గోల్డ్, నేవీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

OPPO A17k లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 189 గ్రాములు, మందం 8.3 మిల్లీ మీటర్లు ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ డివైజ్ ఐపీఎక్స్4 రేటింట్ తో వస్తోంది. OPPO A17k లో ఎంట్రీ లెవెల్ మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ అమర్చారు.

OPPO A17k కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగా పిక్సెల్ సెన్సర్ అమర్చారు. OPPO A17k 4జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OPPO A17k ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు OPPO A17k ని ప్రయత్నించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.