Home News Price cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్

Price cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్

హైలైట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO పలు ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. చాలా ఫోన్ల ధరలను ఒప్పో తగ్గించింది. దీంతో జనాలు ఒప్పో ఫోన్లపై ఓ కన్నేశారు. మాంచి డీల్ దొరికితే కొనేయాలని వారు వేచి చూస్తున్నారు. తాజాగా ఒప్పో సంస్థ ఎంట్రీ లెవెల్ ఫోన్ అయిన OPPO A17k పై రూ.700 డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతే కాదండోయ్.. అదనంగా రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి.

OPPO A17k పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్

OPPO A17k స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గోల్డ్ మరియు నేవీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,274 గా చూపిస్తోంది. రూ.700 డిస్కౌంట్ తర్వాత ధర ఇది.

అయితే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా OPPO A17k ని కొనుగోలు చేస్తే 10 శాతం (రూ.1500 వరకు) ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్ (రూ.1250 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది.

OPPO A17k స్పెసిఫికేషన్స్

OPPO A17k స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ అందించారు. ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. అంటే మొత్తం 7జిబి ర్యామ్ తో ఈ ఫోన్ మల్టీపుల్ యాప్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

OPPO A17k లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. ఎఫ్ఎం రేడియో ఫీచర్ ఇందులో ఉంది. వైఫై, బ్లూటూత్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OPPO A17k కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగా పిక్సెల్ సెన్సర్ అమర్చారు. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OPPO A17k ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు OPPO A17k ని ప్రయత్నించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.