
ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO భారత్ లో OPPO A18 4GB+128GB వేరియంట్ ని లాంచ్ చేసింది. అసలైతే ఈ ఫోన్ 64జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా 128జిబి నయా వేరియంట్ ని ఒప్పో విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
OPPO A18 (4GB+128GB) ధర, లభ్యత
- OPPO A18 4GB+128GB ధరను భారత్ లో రూ.11,499 గా నిర్ణయించారు.
- ఈ కొత్త వేరియంట్ ఫ్లిప్కార్ట్, ఒప్పో ఇండియా వెబ్సైట్స్ లో లిస్ట్ అయ్యింది.
- ప్రస్తుతం OPPO A18 4GB+128GB వేరియంట్ ఒప్పో వెబ్సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. అక్టోబర్ 25 నుంచి సేల్ మొదలవుతుంది.
- ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ మరియు నో-కాస్ట్ ఈఎంఐ పై కంపెనీ రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
- OPPO A18 64GB వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది.
- OPPO A18 హ్యాండ్సెట్ గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO A18 (4GB+128GB) స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Oppo A18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 89.80 పర్సెంట్ స్క్రీన్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 16.7 బిలియన్ కలర్స్, 720 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Oppo A18 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీజీ52 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: Oppo A18 డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీంతో యూజర్ కి 8జిబి ర్యామ్ లభిస్తుంది. Oppo A18 లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ ఈఎంఎంసీ5.1 స్టోరేజీ టెక్నాలజీ వాడారు.
- కెమెరా: Oppo A18 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. నైట్ వీడియో, ఫోటో పొట్రెయిట్, టైమ్ల్యాప్స్, ప్రో, ప్యానో, గూగుల్ లెన్స్ వంటి కెమెరా ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
- బ్యాటరీ: Oppo A18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
- ఓఎస్: Oppo A18 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Oppo A18 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.











