ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెండు కొత్త బడ్జెట్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO A38, OPPO A18 అనే పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు ఈ రెండు డివైజెస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై కనిపించాయి. ఈ విషయం టెక్ఔట్లుక్ అనే వెబ్సైట్ తన కథనం ద్వారా తెలియజేసింది. సరే, ఓసారి ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ల గురించి రివీలైన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.
OPPO A38, OPPO A18 టీడీఆర్ఏ లిస్టింగ్
- ఈ రెండు స్మార్ట్ ఫోన్లు CPH2591, CPH2579 అనే మోడల్ నంబర్లతో సర్టిఫికేషన్ వెబ్సైట్ పై కనిపించింది.
- అయితే లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ ఏవీ కూడా రివీల్ కాలేదు. ఇకపోతే రెండు డివైజెస్ 4జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
- త్వరలోనే ఈ రెండు ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయని లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.
- ఈ రెండు ఫోన్లు కూడా చాలా తక్కువ ధరకే లభించనున్నట్లు సమాచారం.
- అయితే, కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూస్తే గానీ ఇతర వివరాలు తెలిసేలా లేవు.
OPPO A18 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: OPPO A18 డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO A18 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ చిప్ ఉండే అవకాశం ఉంది.
- స్టోరేజీ: OPPO A18 డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: OPPO A18 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OPPO A18 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
- ఓఎస్: OPPO A18 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
OPPO A38 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO A38 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ సిరీస్ చిప్ ఉంటుందని అంచనా.
- స్టోరేజీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO A38 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
